'దేవర' గ్లింప్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్!
- 'దేవర'గా కనిపించనున్న ఎన్టీఆర్
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
- ఈ నెల 8వ తేదీన గ్లింప్స్ రిలీజ్
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 8వ తేదీన గ్లింప్స్ ను వదలనున్నట్టుగా నిన్న ప్రకటించారు. దాంతో 8వ తేదీ ఎంత తొందరగా వస్తుందా అని అభిమానులంతా ఆరాటంతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ అద్భుతమంటూ ఇటీవల కల్యాణ్ రామ్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠ రెట్టింపు అయింది.
ప్రస్తుతం ఈ గ్లింప్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతోందని అంటున్నారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ కి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. దాంతో ఆ వైపు నుంచి కూడా కుతూహలం పెరుగుతోంది. ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.