చంద్రబాబు వస్తే వాలంటీర్లను తీసేస్తారు: మిథున్ రెడ్డి
- చంద్రబాబు మళ్లీ వస్తే జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయన్న మిథున్ రెడ్డి
- ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచన
- ప్రజలకు మేలు చేసే జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాలని విన్నపం
టీడీపీ హయాంలో ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని... పెన్షన్ల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం అన్నీ ఇంటి వద్దకే వచ్చేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. మనకు మేలు చేసిన వారి రుణం తీర్చుకోవాలని... జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాలని ప్రజలను కోరారు.