మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్
- 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్
- ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 టాప్ 50లో జూనియర్
- జాబితాలో 25వ స్థానంలో నిలిచిన తారక్
ఏషియన్ వీక్లీ న్యూస్ మేగజీన్ కు బ్రిటన్ లో ఎంతో పాప్యులారిటీ ఉంది. తాజాగా ఏషియన్ వీక్లీ న్యూస్... ఈస్టర్న్ ఐ 2023 పేరిట టాప్ 50 ఏషియన్ స్టార్లను ప్రకటించింది. ఇందులో తారక్ కు కూడా స్థానం దక్కింది. ఈ లిస్ట్ లో తారక్ 25వ స్థానంలో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే... తారక్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.