అందుకే ఆ మనీ తీసుకోలేదు: 'బిగ్ బాస్' ప్రియాంక!
- బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5గా నిలిచిన ప్రియాంక
- ఎవరి నుంచి ఏమీ ఆశించలేదని వ్యాఖ్య
- ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెట్టానని వెల్లడి
- పేరెంట్స్ కి ఇల్లు కొనిపెడతానని స్పష్టీకరణ
"అమర్ .. శోభ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అందువలన వాళ్లతో కాస్త చనువుగా ఉన్నాను అంతే. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా నా శక్తి మేరకు ఆడాను. విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పుడు మాత్రం బాధపడేదానిని. ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు? అనే విషయంలో చివరి వరకూ మాకు ఒక క్లారిటీ రాలేదు" అని చెప్పింది.
"టాప్ 5వరకూ రావడం గొప్ప విషయంగానే నేను భావిస్తాను. ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బును నేను తీసుకోలేదు. నాపై ఆడియన్స్ నమ్మకం పెట్టుకుని అక్కడి వరకూ తీసుకుని వచ్చారు గనుక అలా చేయాలనిపించలేదు. కష్టపడి సంపాదించి మా పేరెంట్స్ కి ఇల్లు కొనిపెడతాను. ఆ నమ్మకం నాకు ఉంది" అని చెప్పింది.