'దేవర'లో ప్రతి ఫైటూ ఓ క్లైమాక్స్!
- షూటింగు దశలో ఉన్న 'దేవర'
- జనవరి ఫస్టు వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్
- భారీస్థాయిలో జరగనున్న యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న జాన్వీ కపూర్
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - సైఫ్ కాంబినేషన్ లోని రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టుగా చెబుతున్నారు.
ఈ షెడ్యూల్ లో జరిగే పోరాట సన్నివేశాలను పీటర్ హెయిన్ డిజైన్ చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా .. ఆశ్చర్యపోయేలా ఉంటాయనీ, ప్రతి ఫైటూ క్లైమాక్స్ లా అనిపిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణ. ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.