రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదన్న ప్రముఖ నటుడు
- రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడి పాత్రలో గుర్తింపు పొందిన సునీల్ లాహ్రీ
- రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం ఆశ్చర్యపరచలేదని వ్యాఖ్య
- ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చి ఉంటే సంతోషించే వాణ్ణని వ్యాఖ్య
ఆహ్వానం అందకపోవడానికి గల కారణాలను కూడా ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రామాయణ్‌లో తన క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యం లేదని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వాహకులు భావించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనతో వారికి వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూ ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిఒక్కరికీ ఆహ్వానం అందాలన్న నియమం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే, చారిత్రాత్మక క్షణాల్లో తనకూ భాగమయ్యే అవకాశం లభించి ఉంటే సంతోషించే వాడినని సునీల్ లాహ్రీ తెలిపారు.