నేడు శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ వివాహం
- తనకు వరుసకు మరదలయ్యే ప్రత్యూష చాపరాలతో అభిరామ్ వివాహం
- రాత్రి 8.50 గంటలకు ముహూర్తం
- సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్‌లో వేడుక
- 200 మంది అతిథుల హాజరు
అభిరామ్‌కు వరుసకు మరదలయ్యే ప్రత్యూష.. అతడి చినతాత కూతురికి కూతురు. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. హల్దీ, మెహందీ కార్యక్రమాలను నగరంలోనే నిర్వహించారు.
కాగా, పెళ్లి తరువాత ఇరు కుటుంబాల వారు రేపు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని సమాచారం.