ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున..: 'బబుల్ గమ్' నుంచి సాంగ్ రిలీజ్!
- టీనేజ్ లవ్ స్టోరీగా 'బబుల్ గమ్'
- హీరోగా పరిచయమవుతున్న రోషన్ కనకాల
- మానస చౌదరికి ఇదే ఫస్టు సినిమా
- ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి 'జానూ' అంటూ సాగే 3rd సింగిల్ ను రిలీజ్ చేశారు. 'ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున, దేనికే ఈ ఆలాపనా గొంతు తడి ఆరినా' అంటూ ఈ పాట మొదలవుతోంది. నాయిక దూరం కావడంతో .. ఆమె ఎడబాటును తట్టుకోలేక .. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ హీరో పాడుకునే పాట ఇది.
మెలోడియస్ గా సాగే వేదనా భరితమైన సాంగ్ ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ బాణీకి అనంత్ శ్రీరామ సాహిత్యాన్ని అందించగా, జావేద్ ఆలపించాడు. బీట్ యూత్ మనసులను పట్టుకునేలానే ఉంది. మొదటి సినిమాతో రోషన్ కనకాల ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.