బాసర ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
- బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం
- విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య
- ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని, ఇవాళ ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ తీసుకున్నాడని వైస్ చాన్సలర్ వెల్లడించారు. ప్రవీణ్ కుమార్ హాస్టల్ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించాడు. తన గదిలో కాకుండా మరో గదిలో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు.