అదే సమయంలో నా వైవాహిక జీవితం ముగిసిపోయింది: సమంత
- ఆరోగ్యం దెబ్బతినడం తన పనిపై ప్రభావం చూపిందన్న సమంత
- దీని కారణంగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని వెల్లడి
- పలు సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయని ఆవేదన
తాను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నానని... అదే సమయంలో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం దెబ్బతినడం తన పని మీద ప్రభావం చూపిందని చెప్పారు. దీని కారణంగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. ఇవన్నీ తన జీవితంలో బాధాకరమైనవని చెప్పారు. పలు సమస్యలు తనను ఒక్కసారిగా చుట్టుముట్టాయని తెలిపారు.
ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలో... ఆరోగ్య సమస్యలకు గురైన వారి గురించి, ట్రోలింగ్స్ గురించి ఆందోళనకు గురైన వారి గురించిన కథనాలను చదివానని చెప్పారు. వాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడిన కథనాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని తెలిపారు. తన శక్తి మేరకు తాను పోరాడుతున్నానని.. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయంలో పోరాడే శక్తి ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.