లంగా ఓణీలో జాన్వీ పల్లెటూరి సోయగం... 'దేవర' నుంచి లేటెస్ట్ స్టిల్ విడుదల
- ఎన్టీఆర్, కొరటాల కలయికలో దేవర
- గోవాలో తాజా షెడ్యూల్
- జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
- "ఇదిగో మా తంగం" అంటూ జాన్వీ స్టిల్ పంచుకున్న దేవర యూనిట్
ఈ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. "ఇదిగో మా తంగం" అంటూ చిత్రబృందం పేర్కొంది. దేవర చిత్రం తాజాగా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ కోసం ఇటీవల గోవా వెళ్లాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.