వెంకీ మల్టీ స్టారర్ మూవీలో మరోసారి ఛాన్స్ కొట్టిన చైతూ!
- సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో వెంకటేశ్
- ఇది మల్టీ స్టారర్ కంటెంట్ అంటూ టాక్
- చైతూను ఎంపిక చేసినట్టుగా సమాచారం
- 'వెంకీ మామ' తరువాత రిపీట్ అవుతున్న కాంబో
చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, వెంకటేశ్ ఆ తరువాత ప్రాజెక్టును లైన్లో పెట్టినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో నిర్మించనున్నారని అంటున్నారు.
ఇది మల్టీ స్టారర్ సినిమా అనేది తాజా సమాచారం. అందువలన ఈ సినిమాలో మరో హీరో పాత్రకి గాను చైతూను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'వెంకీమామ' తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చందూ మొండేటి ప్రాజెక్టుతో చైతూ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన వెంకీ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడని అంటున్నారు.