మాకు అమరావతి కూడా ముఖ్యమే: మంత్రి కొట్టు సత్యనారాయణ
- అమరావతికి ప్రాధాన్యత ఇస్తూనే అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తున్నామన్న కొట్టు
- అమరావతే ముద్దు, మిగతా ప్రాంతాలు వద్దని విపక్షాలు చెబుతున్నాయా? అని ప్రశ్న
- జగన్ అమరావతికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని వ్యాఖ్య
విపక్ష నేతలు అమరావతి ఒకటే రాజధాని అంటే మాత్రం వారు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతిని శాసన రాజధానిగానే ఉంచి ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నారన్నారు. అందుకే ఆయన అమరావతిలోనే ఇల్లు కట్టుకొని అమరావతి మీద అభిమానం చాటుకున్నారని చెప్పారు. శాసన రాజధానిగా అమరావతికి జగన్ అత్యంత ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేస్తారన్నారు.