నాగార్జున 100వ సినిమా దర్శకుడు ఎవరంటే ..!
- సెట్స్ పై ఉన్న నాగ్ 'నా సామిరంగ'
- కెరియర్ పరంగా ఆయనకి ఇది 99వ సినిమా
- నవీన్ తో 100వ సినిమాకి సన్నాహాలు
- నిర్మాతగా తెరపైకి జ్ఞానవేల్ రాజా పేరు
ఈ నేపథ్యంలో నాగార్జున 100వ సినిమాకి సంబంధించిన విషయాలపై అభిమానులు ఎక్కువ దృష్టి పెట్టారు. మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా ఉండే ఛాన్స్ ఉండనే టాక్ ఆ మధ్య బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు తమిళ దర్శకుడు నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల వచ్చిన 'అగ్ని సిరగుగల్' ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
విజయ్ ఆంటోని - అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ఆయన డీల్ చేసిన తీరు నాగార్జునకి నచ్చిందట. అందువల్లనే ఆయన నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.