వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్!
- అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కరరెడ్డి
- సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు
- ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు, ఓ వెహికిల్
ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భాస్కరరెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఎస్కార్ట్ బెయిల్ వచ్చింది.