సూర్యుడి దిశగా పయనమైన ఆదిత్య ఎల్-1.. విజయవంతంగా కక్ష్య పెంపు
- సూర్యుడి రహస్యాల ఛేదనకు బయలుదేరిన ఆదిత్య ఎల్-1
- ఐదోసారి విజయవంతంగా కక్ష్య పెంచిన శాస్త్రవేత్తలు
- ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ఇస్రో
ఇప్పటి నుంచి ఉపగ్రహం 110 రోజులు ప్రయాణించి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరోమారు విన్యాసం చేపట్టి ఎల్-1 కక్ష్యలో ప్రవేశపెడతారు. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా వంటివాటి పరిశోధనకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్పేస్ ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ మిషన్.