వ్యాపార రంగంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార
- చర్మ సంరక్షణ ఉత్పత్తి తీసుకొస్తున్నట్టు వెల్లడి
- భర్తతో కలిసి ‘9స్కిన్’ పేరిట బ్రాండ్ ప్రకటన
- జవాన్ చిత్రంతో భారీ విజయం అందుకున్న నయన్
ఈ నెల 29 నుంచి ఉత్పత్తులను విక్రయించనున్నట్టు ఆమె ప్రకటించిన ప్రోమోను షేర్ చేసింది. నయన్ ఇది వరకు చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ రెనిటా రాజన్తో కలిసి లిప్బాల్మ్ కంపెనీని ప్రారంభించింది. కాగా, సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు ఇప్పటికే వ్యాపార రంగంలోకి వచ్చారు. రకుల్ ప్రీత్, సమంత, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు.