అవ్వ.. ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?: ఆర్జీవీ
- స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రి జైలుకు చంద్రబాబు
- ఆయన అరెస్ట్‌పై వరుస ట్వీట్లు చేస్తున్న వర్మ
- టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌ను ఏపీ ప్రజలు పట్టించుకోలేదని కామెంట్
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిన్న తెలుగు దేశం పార్టీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్ ను ప్రజలు పట్టించుకోలేదని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు. ‘మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా, నలభై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలేసినందుకు బంద్ కి పిలిస్తే, ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్ లు చేసుకున్నారా? అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని అని ట్వీట్ చేశారు.