బీదర్లో 'సైంధవ్' భారీ యాక్షన్
- దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా వస్తున్న చిత్రం
- యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న శైలేష్ కొలను
- డిసెంబర్ 22న విడుదల కానున్న సినిమా
ప్రస్తుతం తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బీదర్ లో ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. వెంకటేశ్, విలన్స్ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్ కొలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న విడుదల కానుంది.