మళ్లీ జట్టు కట్టిన విరూపాక్ష బృందం.. ఈసారి మైథికల్ థ్రిల్లర్
- సాయితేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష
- కార్తిక్ దండు దర్శకతంలో వచ్చిన చిత్రం సూపర్ హిట్
- కార్తిక్, సుకుమార్, బీవీఎస్ఎన్ కాంబినేషన్లో
రాబోతున్న మరో సినిమా
అన్వేషణలో భాగంగా ముగ్గురు వ్యక్తులు గుహల్లో వేలాడుతున్నట్లు పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇది మైథికల్ థ్రిల్లర్ అని పోస్టర్ లో చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలిపింది. అయితే ఇది విరూపాక్షకు సీక్వెలా? లేక కొత్త చిత్రమా? అన్నది తెలియాల్సి ఉంది. హీరో ఎవరనేది కూడా ఇంకా వెల్లడించలేదు. హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.