‘చంద్రముఖి 2’ నుంచి ‘స్వాగతాంజలి’ లిరికల్ సాంగ్ రిలీజ్!
- 'చంద్రముఖి' సీక్వెల్ గా 'చంద్రముఖి 2'
- టైటిల్ రోల్ ను పోషించిన కంగనా రనౌత్
- ప్రధానమైన పాత్రలో కనిపించనున్న లారెన్స్
- సంగీతాన్ని అందించిన కీరవాణి
- 'వినాయక చవితి'కి వివిధ భాషల్లో విడుదల
ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో ఈ పాట వినసొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమల పాడిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు. 2005లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనర్‌లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన 'చంద్రముఖి' చిత్రానికి కొనసాగింపుగా ‘చంద్రముఖి 2’ను రూపొందించారు.
ఇతర ముఖ్యమైన పాత్రల్లో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, వై.జి.మహేంద్రన్ .. రావు రమేష్, సురేశ్ మీనన్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 'వినాయక చవితి'కి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.