‘బ్రో’ తరువాత నా కెరీర్‌ను మలుపు తిప్పే ఛాన్స్ వచ్చింది: నటుడు పృథ్వీ
- ‘బ్రో’ సినిమాలోని ‘శ్యాంబాబు’ పాత్రతో అభిమానులను అలరించిన పృథ్వీ
- శ్యాంబాబు పేరుతోనే మరో సినిమాలో నటించబోతున్నానని వెల్లడి
- తెరపై తన పాత్ర రెండు గంటలసేపు కనిపిస్తుందన్న నటుడు
- మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానంటూ వీడియో విడుదల
‘‘ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, ఆయన చేయబోయే శోభన్‌బాబు సినిమాలో తెరపై రెండు గంటలు ఉంటాడు. నాకు ఇది అద్భుతమైన అవకాశం. ఆ రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్లో సినిమా చేస్తున్నాను? తదితర విషయాలు త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ’’ అని ఓ వీడియో విడుదల చేశారు.