'ఎక్స్ ట్రా' నుంచి 'డేంజర్ పిల్లా' ఫుల్ సాంగ్ రిలీజ్!
- నితిన్ హీరోగా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'
- సంగీతాన్ని అందించిన హారీస్ జైరాజ్
- విదేశాల్లో చిత్రీకరించిన పాట
- కొరియోగ్రఫీని అందించిన శేఖర్ మాస్టర్
- డిసెంబర్ 23వ తేదీన రిలీజ్
"అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా .. చీకట్లో తిరగని మిణుగురు తళుకువా" అంటూ ఈ పాట సాగుతోంది. విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. హారీస్ జైరాజ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా .. అర్మాన్ మాలిక్ ఆలపించాడు.
ఈ పాటకి శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. ఇందులో నితిన్ మంచి హ్యాండ్సమ్ గా .. శ్రీలీల చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హీరోగా నితిన్ కీ .. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఇద్దరి ఆశను ఈ సినిమా నెరవేర్చుతుందేమో చూడాలి.