బూతులుంటేనే ఆడియన్స్ చూస్తారనుకోవడం అవివేకం: జేడీ చక్రవర్తి
- జేడీ చేసిన వెబ్ సిరీస్ గా 'దయా'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- వచ్చేనెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
- కంటెంట్ బాగుంటేనే చూస్తారన్న జేడీ
"పవన్ సాధినేని నాకు కథ చెప్పినప్పుడు బాగుందనిపించింది .. ఆయన టేకింగ్ చూస్తున్నప్పుడు ఇంకా బాగుందనిపించింది. ఈ కథను ఇలా కూడా తీయవచ్చునా? అని డబ్బింగ్ చెబుతున్నప్పుడు అనిపించింది. అలా ఈ ప్రాజెక్టుపై నా అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతూ వెళ్లాడు. ఈ కథ ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూ వెళుతూ ఉంటుంది" అని చెప్పాడు.
ఇక ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో .. సినిమాలలో ఒక బూతు మాటను చాలా తేలికగా వాడేస్తున్నారు. బూతు డైలాగ్స్ ఎక్కువగా ఉంటే .. అమ్మాయిలు బట్టలు తక్కువ వేసుకుంటే ఎక్కువమంది చూస్తారనుకోవడం అవివేకం. వెబ్ సిరీస్ అయినా .. సినిమానైనా సక్సెస్ కావాలంటే బలమైన కంటెంట్ కావలసిందే" అంటూ చెప్పుకొచ్చాడు.