'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్.. వేడుకకు వచ్చే వారి కోసం కీలక ప్రకటన
- ప్రీరిలీజ్ ఈవెంట్ ఆలస్యంగా ప్రారంభమవుతుందన్న 'బ్రో' చిత్ర యూనిట్
- వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు నిర్ణయం
- ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బ్రో'
హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీస్ శాఖ వారి సూచనల మేరకు ప్రీరిలీజ్ వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వేడుక రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.