చిరంజీవి సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా
- మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
- చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా
- తమన్నా డబ్బింగ్ చెప్పడం పూర్తయిందన్న మెహర్ రమేశ్
- వినోదాల విందు ఖాయమని ధీమా
ఈ చిత్రంలో చిరంజీవితో తమన్నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని, తమన్నా గ్లామరస్ గా మెరిసిపోయిందని వివరించారు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, బ్రహ్మానందం, హైపర్ ఆది తదితరులు నటించిన భోళాశంకర్ తో నవ్వుల విందు ఖాయమని మెహర్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన 'మిల్కీ బ్యూటీ' పాటకు విశేష స్పందన లభిస్తోంది.