అలా చేసినందుకు చిరంజీవి నాపై కోప్పడ్డారు: కోట శ్రీనివాసరావు
- తనపై ఎన్నో పుకార్లు వచ్చాయన్న కోట
- టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉందని వ్యాఖ్య
- కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండేవాడినని వెల్లడి
- ఆ రోజున అలా జరిగిపోయిందని వివరణ
"నేను పత్తిత్తును అని చెప్పడం లేదు .. కానీ సినిమాలకి సంబంధించినంత వరకూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. లేకపోతే అంత కాలం పాటు అన్ని సినిమాలు ఎలా చేస్తాను. నా బిహేవియర్ బాగోలేకపోతే ఇంత కెరియర్ ఉండదు కదా. నాలో మంచితనం అనేది లేకపోతే .. మంచివాడిని కాకపోతే భగవంతుడు నాకు ఎలా సాయం చేస్తాడు? పెద్దగుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు .. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడే 'కోట' అని అన్నారు.
"ఒకసారి మాత్రం షూటింగుకి వెళితే మధ్యాహ్నం వరకూ నా షాట్ లేదని చెప్పారు. ఎమ్మెస్ వత్తిడి చేస్తే సెట్లోనే కాస్త మందు పుచ్చుకున్నాను. కానీ ఆ వెంటనే షాట్ కి పిలిచారు. ఇలా జరిగిందేంటబ్బా అనుకుంటూనే షాట్ కి వెళ్లాను. నేను తాగేసి షూటింగుకి వచ్చాననే విషయం చిరంజీవిగారికి తెలిసింది. ఎంతో టాలెంట్ పెట్టుకుని ఇలా చేస్తే, కెరియర్ దెబ్బతింటుందంటూ ఆయన నా మేలు కోరి చెబుతూ, కోప్పడ్డారు" అంటూ చెప్పుకొచ్చారు.