టాలీవుడ్లో తెలుగమ్మాయిల కంటే పరాయి వాళ్లకే అవకాశాలు: ఈషా రెబ్బా
- బయటి పరిశ్రమల వాళ్లు తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారని వ్యాఖ్య
- ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో
ఈషాకు గుర్తింపు - ప్రస్తుతం ‘మాయా మశ్చీంద్ర’ ‘దయా’ చిత్రాలు చేస్తున్న యువ నటి
తాను ఇతర భాషా చిత్రాల్లో నటించినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం గర్వంగా అనిపించేదని చెప్పింది. అయితే తెలుగులో మాత్రం పరభాషా నాయికలనే ఎక్కువగా తీసుకుంటారని తెలిపింది. ‘ఇతర భాషల కథానాయికలు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్ చేయరు కదా? అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాదు’ అని ఈషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.