ఈ సారి హిట్ కొట్టాల్సిందే అంటున్న శ్రీసింహా!
- సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీసింహా
- ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'భాగ్ సాలే'
- దర్శకుడిగా ప్రణీత్ పరిచయం
- ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల
అప్పటి నుంచి శ్రీసింహా తనకి నచ్చిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'మత్తువదలరా' .. 'తెల్లవారితే గురువారం' .. 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలు హిట్ కాకపోయినా, కొత్త ప్రయోగం .. కొత్త ప్రయత్నం అని మాత్రం అనిపించుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన తాజా చిత్రంగా 'భాగ్ సాలే' సినిమా రూపొందింది.
బిగ్ బెన్ సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రణీత్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 7వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామనే పట్టుదలతో శ్రీసింహా ఉన్నాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులోను ఆయన మాటల్లో ఈ నమ్మకమే కనిపించింది. చూడాలి మరి ఈ సినిమా ఆయనకి సక్సెస్ ను ఇస్తుందేమో.