స్పై హీరోయిన్ కు జాక్ పాట్.. పవన్ సరసన అవకాశం!
- నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమాలో మెప్పించిన ఐశ్వర్య మీనన్
- పవన్, సుజీత్ కాంబినేషన్లలో వస్తున్న ఓజీ
- ఒక హీరోయిన్ గా ఐశ్వర్యను తీసుకున్నట్టు ప్రచారం
నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమా హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ కు ఆ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన ఐశ్వర్యా మీనన్ 2012లో విడుదలైన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’తో టాలీవుడ్ కు పరిచయం అయింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నిఖిల్ సిద్ధార్థ్ తో కలిసి పూర్తి స్థాయి హీరోయిన్ గా స్పై లో నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా.. ఐశ్వర్యా మీనన్ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంది. దాంతో, ఓజీ నుంచి ఆమెకు చాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.