'రాయల్'గా రానున్న రెబల్ స్టార్!
- ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి
- ఇప్పటికే 60 శాతం షూటింగు పూర్తి
- గతంలో అనుకున్న టైటిల్ 'రాజా డీలక్స్'
- 'రాయల్' గా మార్చారంటూ టాక్
- అతిథి పాత్రలో వర్మ కనిపించనున్నాడని ప్రచారం
పీపుల్ మీడియావారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక సినిమా థియేటర్ నేపథ్యంలో నడిచే కథ అనీ, 'రాజా డీలక్స్' అనే పేరును ఖాయం చేయనున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ టైటిల్ విషయంలో మేకర్స్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి 'రాయల్' అనే టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, రిజిస్టర్ కూడా చేయించారట. ఈ సినిమాకి దాదాపుగా ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు.
ఇక ఇందులో ప్రభాస్ జోడీగా నిధి అగర్వాల్ .. మాళవిక మోహనన్ .. రిధి కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో రామ్ గోపాల్ వర్మ కనిపించనున్నారని చెబుతున్నారు. మొత్తానికి మీడియం బడ్జెట్ మూవీ అంటూనే, పాన్ ఇండియా స్థాయి టైటిల్ ను మారుతి సెట్ చేశాడన్న మాట.