ప్రభాస్ కు విదేశాల్లో అత్యంత ఖరీదైన విల్లా.. ఎక్కడుందో తెలుసా?
- గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్
- విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న యంగ్ రెబల్ స్టార్
- ఇటలీలో అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు
మరోవైపు ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారమవుతోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నాడనేదే ఆ వార్త. ముఖ్యంగా ఇటలీలో కాస్ట్లీ లొకాలిటీలో ప్రభాస్ కు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన విల్లా ఉందని జాతీయ మీడియాలో కథనం వచ్చింది. షూటింగ్ లు లేని సమయంలో ప్రభాస్ తనకు అత్యంత సన్నిహితులైన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్తుంటాడట. తాను బిజీగా ఉన్నప్పుడు విల్లాను ఖాళీగా ఉంచకుండా అద్దెకు ఇస్తున్నాడని, దీని వల్ల నెలకు రూ. 50 లక్షలకు పైగానే రెంట్ వస్తోందని సదరు కథనంలో పేర్కొన్నారు.