బహిరంగంగా కూతురు వాగ్వాదం.. తన బిడ్డను తప్పుదారి పట్టిస్తున్నారని ముత్తిరెడ్డి కంటతడి
- చేర్యాల భూములపై తండ్రిని నిలదీసిన ముత్తిరెడ్డి కూతురు
- తన కూతురును రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని కంటతడి
- తాను తప్పు చేస్తే ప్రజలే తనకు బుద్ధి చెబుతారని వ్యాఖ్య
ఈ విషయమై ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకున్నారని ఆరోపించారు. తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదని, తన కుమార్తెకు తన సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే తనకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి చేర్యాలలో తన పేరు మీద ఉన్న భూమిని ఆయన తన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కూతురు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేశారు.