సర్‌ప్రైజ్.. థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ చిత్రం
- సౌత్‌లో సూపర్ హిట్ అయిన 2018 చిత్రం
- మలయాళంలో 80 కోట్లు.. మొత్తంగా 150 కోట్ల వసూలు
- ఈ రోజు నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్
థియేటర్లలో ఉండగానే అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నారాయణ్, తన్వి రామ్, జాయ్ మాథ్యూ తదితరులు నటించారు.