చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- ప్రభాస్ కథానాయకుడిగా 'ఆదిపురుష్'
- ఆయన చేసిన తొలి పౌరాణిక చిత్రం ఇది
- రావణ పాత్రలో కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్
- ఐదు భాషల్లో ఈ నెల 16వ తేదీన విడుదల
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువే. సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ నటించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు 'తిరుపతి'లో నిర్వహిస్తున్నారు.
'శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం'లో ఈ వేడుకను అత్యంత ఘనంగా జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా 'చినజీయర్ స్వామి' వస్తుండటం విశేషం. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
