తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే!
- ఈనెల 6న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహణ
- భారీ స్థాయిలో ఈవెంట్ ఉంటుందని టాక్
- ఈ నెల 16న విడుదల కానున్న సినిమా
వరుస పోస్టర్లతో పాటు టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేస్తూ హైప్ తెస్తోంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించింది. అందుకు వేదికగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరాన్ని ఎంచుకుంది. ఈ నెల 6వ తేదీ మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలవుతుందని తెలిపింది. ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్, కృతీ సహా ప్రధాన తారాగనం, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు. వేడుకకు వచ్చే అతిథులు వివరాలు తెలియాల్సి ఉంది.