దగ్గుబాటి రానా నిర్మాతగా దుల్కర్ హీరోగా సినిమా
- రానాకు చెందిన స్పిరిట్ బ్యానర్ లో తెలుగు-తమిళ చిత్రం
- టాలీవుడ్ లో మంచి మార్కెట్ సంపాదించుకున్న దుల్కర్
- చిత్రాన్ని తెరకెక్కించనున్న కొత్త దర్శకుడు
ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పుడు రానా నిర్మాణంలోని ‘స్పిరిట్’ మీడియా బ్యానర్ లో మరోచిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ యువ సాంకేతిక నిపుణుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.