కమలహాసన్ వ్యాఖ్యలపై స్పందించిన 'ది కేరళ స్టోరీ' దర్శకుడు
- 'ది కేరళ స్టోరీ'పై కమలహాసన్ విమర్శలు
- ఇదో ప్రచార చిత్రమంటూ వ్యాఖ్యలు
- ఈ సినిమా చూడని వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దర్శకుడు సుదీప్తో సేన్
‘‘తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మా చిత్రంపై బ్యాన్ విధించారు. దాంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఈ సినిమాను చూడలేదు. అందువల్లే వాళ్లు దీన్ని ఒక ప్రచార చిత్రమని అనుకుంటున్నారు. అలాగే, మన దేశంలో మూసధోరణులు ఫాలో అయ్యేవాళ్లు అధికంగా ఉన్నారు. జీవితమంటే కేవలం తెలుపు లేదా నలుపులోనే ఉండాలని అనుకుంటారు. బూడిద రంగులో ఉంటుందని వారికి తెలియదు’’ అని సుదీప్తో వ్యాఖ్యానించారు. సినిమా టైటిల్లో ది రియల్ స్టోరీ అని రాసుకున్నంత మాత్రాన అది వాస్తవం అయిపోదని కమలహాసన్ 'ది కేరళ స్టోరీ'ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.