మహేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటనపై అప్ డేట్ ఇదిగో!
- మహేశ్ బాబు కెరీర్ లో 28వ చిత్రం
- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మాస్ ఎంటర్టయినర్
- మే 31న టైటిల్ వెల్లడి
కాగా, ఇప్పటివరకు ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ కొనసాగించారు. ఇది మహేశ్ బాబుకు 28వ చిత్రం. ఇందులో మహేశ్ మాస్ లుక్ తో కనిపిస్తుండడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.