'అహింస' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు!
- అభిరామ్ హీరోగా రూపొందిన 'అహింస'
- తేజ నుంచి వస్తున్న మరో ప్రేమకథ
- ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ
- జూన్ 2వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ - చీరాలలోని NRPM హైస్కూల్ గ్రౌండ్ లో ఈ నెల 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6:30 నిమిషాల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.
ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సదా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇంతవరకూ వదలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రేమకథా చిత్రంతో అభిరామ్ ఫస్టు హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా తరువాత తేజ సినిమా రానాతో ఉన్న సంగతి తెలిసిందే.