చికోటి ప్రవీణ్ ను ఏడు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
- హైదరాబాద్లోని ఈడి కార్యాలయంలో సుదీర్ఘ విచారణ
- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నగదు బదిలీలపై ప్రశ్నలు
- థాయ్ లాండ్ క్యాసినో కేసులో అరెస్టై, విడుదలైన చికోటి
సంఘటన స్థలం నుండి అక్కడి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ట్రాన్సాక్షన్స్ గురించి ఈడీ ప్రశ్నించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తాను ఆహ్వానితుడిగా వెళ్లానని చికోటి ఇదివరకే పలుమార్లు చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి చికోటితో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్ లకు ఈడీ నోటీసులు ఇచ్చింది.