నాన్న బిజినెస్ మేన్ అయినప్పటికీ, ఒక్కపూటనే తింటూ కష్టాలు పడ్డాను: హీరో శివబాలాజీ
- హీరోగా సక్సెస్ కాలేకపోయిన శివబాలాజీ
- తన ఫ్యామిలీ నేపథ్యం గురించిన ప్రస్తావన
- సినిమాల పట్ల ఇష్టంతో వచ్చానని వెల్లడి
- అందుకోసం చాలా కష్టాలు పడ్డానన్న హీరో
"అయితే నాకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. యాక్టింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువలన నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాను. ఆ తరువాత ఫోన్ చేసి నాన్నకి విషయం చెప్పాను .. 'అయితే అక్కడే ఉండు' అంటూ ఆయన కోపంగా ఫోన్ పెట్టేశారు. నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు" అని చెప్పాడు.
" ఆ సినిమా తరువాత చిన్న రూమ్ రెంట్ కి తీసుకున్నాను. మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాను. దగ్గరున్న డబ్బులు అయిపోతున్నాయి .. అవకాశాలు రావడం లేదు. ఆ సమయంలో కావాలని చెప్పేసి నేను లేటుగా నిద్రలేచేవాడిని. ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడిని. అలా నేను పడిన కష్టాలు చాలామందికి తెలియదు" అంటూ చెప్పుకొచ్చాడు.