తొలి రోజు కస్టడీ కలెక్షన్లు అంతేనా.. !
- నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్ లో సినిమా
- నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
- మొదటి రోజు రూ. రెండున్నర కోట్లు వసూలు!
అరవింద్ స్వామి, శరత్ కుమార్, రాంకీ వంటి ప్రముఖ తమిళ నటులు ఉన్నా.. ఇళయరాజా సంగీతం అందించినా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలుస్తోంది. మొదటి రోజే కలెక్షన్స్ లో తేలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కస్టడీ సినిమా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే రాబట్టినట్టు సమచారం. ముఖ్యమైన నైజాం ఏరియా నుంచి రూ.75 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా థియేటర్ హక్కులు సుమారు రూ.21 కోట్ల వరకు అమ్ముడయ్యానని సమాచారం. తొలి రోజు కలెక్షన్స్ చూస్తే ఆ మొత్తం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.