చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితురాలు రేణుక
- టీఎస్‌పీఎస్సీ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న రేణుక
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- పూచీకత్తు సమర్పించడంతో సాయంత్రం విడుదల
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుకను పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పలువురు నిందితులు అరెస్టయ్యారు. నాటి నుండి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. రేణుక అనారోగ్యం పాలు కావడం, మహిళ కావడం, దర్యాఫ్తు చివరి దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరయింది.