అమరావతి అంటే ఆకాశంలో ఉంటుందా... ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు: బొత్స
- అమరావతిలో కేవలం ధనికులే ఉండాలంటే కుదరదన్న బొత్స
- ఇదేమైనా ప్రైవేటు స్థలమా లేక ప్రైవేటు వెంచరా అంటూ ఆగ్రహం
- అమరావతి అందరిదీ అని స్పష్టీకరణ
కోర్టు తీర్పు వస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతుందే తప్ప, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోదు కదా, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించదు కదా అని అన్నారు.
ఈ సందర్భంగా బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఆయనదొక రాజకీయ పార్టీ. గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాడు. తహతహలాడుతున్నాడు, తపన పడుతున్నాడు... పడనీయండి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.