'శాకుంతలం' విషయంలో నా జడ్జిమెంట్ తప్పింది: దిల్ రాజు
- ఏప్రిల్ 25న విడుదలైన 'శాకుంతలం'
- తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా
- నిర్మాణ భాగస్వామిగా ఉన్న దిల్ రాజు
- ఈ సినిమా తనకి పెద్ద జర్క్ ఇచ్చిందంటూ వ్యాఖ్య
'శాకుంతలం' సినిమాపై విడుదల వరకూ పెరుగుతూ వెళ్లిన అంచనాలు ఆ తరువాత ఒక్కసారిగా చప్పున చల్లారిపోయాయి. శకుంతల పాత్రకి సమంత సెట్ కాలేదనీ .. గ్రాఫిక్స్ విషయంలో క్వాలిటీ లోపించిందనే టాక్ బలంగా వినిపించింది. ఈ సినిమా తీసుకొచ్చిన నష్టాలు కూడా ఎక్కువేననే చర్చలు జరిగాయి.
తాజాగా ఈ సినిమా గురించి దిల్ రాజు ప్రస్తావిస్తూ, నా 25 ఏళ్ల కెరియర్లో 'శాకుంతలం' సినిమా పెద్ద జర్క్ ఇచ్చిందని అన్నారు. ఈ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ తప్పిందని చెప్పారు. ఇంతకుముందు సమంతతో తాను చేసిన 'జాను' సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.