భారీ నష్టాలు తెచ్చిపెట్టిన 'రావణాసుర'?
- ఈ నెల 7న వచ్చిన 'రావణాసుర'
- ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన సినిమా
- నెగెటివ్ కేరక్టర్ దెబ్బకొట్టేసిందన్న ఫ్యాన్స్
- షూటింగు దశలో 'టైగర్ నాగేశ్వరరావు'
ఈ సినిమాకి అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించగా, రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. రవితేజకి హ్యాట్రిక్ హిట్ ఖాయమని అంతా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది.
ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టిందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. రవితేజ కూడా ఈ నష్టాలను పాలుపంచుకోక తప్పదని అంటున్నారు. ఇక రవితేజ నెక్స్ట్ మూవీగా 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగు జరువుకుంటోంది. ఈ సినిమాతో రవితేజ తన అభిమానులను ఖుషీ చేస్తాడేమో చూడాలి.