'బలగం' ఫేమ్ మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య
- డయాలసిస్ చేయించుకుంటుండగా గుండెపోటు
- హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు
- మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎర్రబెల్లి
ఈ నేపథ్యంలో, నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి డాక్టర్లతోనూ మాట్లాడారు. మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మొగిలయ్యకు భరోసా ఇచ్చారు.