మోదీని, కేంద్ర మంత్రులను కలుస్తుండటం వల్లే ఈ ప్రచారం జరుగుతోంది: కోమటిరెడ్డి
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం
- ఈ వార్తల్లో నిజం లేదన్న కోమటిరెడ్డి
- పార్టీ మారాలనే ఆలోచన ఉంటే తానే ప్రకటిస్తానని వ్యాఖ్య
గతంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై తాను కొన్ని కామెంట్లు చేసిన సంగతి నిజమేనని... అయితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత తన మనసును మార్చుకున్నానని కోమటిరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను తాను కలుస్తున్నానని చెప్పారు. వీరిని కలుస్తున్నందువల్లే తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను వదిలేసి తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర తనదని చెప్పారు. గెలిచే అభ్యర్థులకు పార్టీ టికెట్లను త్వరగా ఇవ్వాలని కోరారు. కర్ణాటక మాదిరే తెలంగాణలో కూడా అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని చెప్పారు.