ఉస్తాద్ ఊచకోత షురూ.. మరోసారి ఖాకీ డ్రెస్సులో పవర్ స్టార్
- మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్
- సెట్ లో ఖాకీ డ్రెస్ లో ఉన్న పవన్ ఫొటోను షేర్ చేసిన చిత్ర బృందం
- గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్–పవన్ కాంబోలో మరో సినిమా
షూటింగ్ మొదలైన విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేరర్స్ ప్రకటించింది. ఉస్తాద్ ఊచకోత షురూ అంటూ ఓ పోస్టర్ ను సైతం ట్విట్టర్ లో పంచుకుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ ఖాకీ డ్రెస్సులో పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చొని ఓ చేత్తో తుపాకీ, మరో చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఉండగా వెనుక నుంచి తీసిన ఫొటోను షేర్ చేసింది. ఈ సినిమాకు మరో దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే, కథ అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు', యువ దర్శకుడు సుజిత్ సినిమాకు కూడా పవన్ ఓకే చెప్పారు.